29, ఏప్రిల్ 2011, శుక్రవారం

రవి వర్మ (సినీ గాయకులు)

రవి వర్మ గాయకుడు
మనిషి ప్రాణ నాడులను తట్టిలేపే పాట పాడగలగడం కొందరికే సొంతం.. మోడువారిన మనసుకు స్వరపుష్పాలతో వసంతాన్ని చిలకరించ గల శక్తి ఒక్క పాటకే ఉంది. ఆ గానామృత ధారలను కురిపించే శక్తిని సొంతం చేసుకోవడం ఒక వరం. ఆ వరాన్ని పొందిన మెలోడి అండ్ మాస్ సింగర్ రవివర్మ.
స్పాట్
రవివర్మది మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ మండలం, దుండ్యాల గ్రామం. తండ్రి నారాయణాచారి, తల్లి,సరోజినమ్మ. భార్య సుమ, కూతురు సహన.. రవి చదువంతా వరంగల్లోనే సాగింది. కళాశాల వయసు నుంచే పాటలంటే రవివర్మకు ప్రాణం. గాయకుడిగా ఎదగాలని ఎంతో తపించేవాడు. దానికోసం ఎంతో ప్రయత్నించిండు. ఆయన తొలిసారి చిత్రం సినిమాలో పాడిన ఢిల్లీ నుంచి గల్లీ దాక అనే పాట కెరీర్ లో మొదటి పాటగా నిలిచింది. ఈ పాట రవివర్మ కెరీర్ను మలుపుతిప్పింది. గల్లీ నుంచి ఖండాంతరాలను దాటించింది.
స్పాట్
రవి వర్మ మంచి సంగీత దర్వకత్వ పటిమ గల వ్యక్తి కూడా. ఆయన స్వయంగా వైరస్ అనే ఆల్బం ద్వారా సంగీతాభిమానులకు మరింత చేరువయిండు. తెలుగు సంగీత ప్రపంచంలో రవివర్మ తరదైన ముద్ర వేసుకోగలిగిండు. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ్ , కన్నడ భాషల్లో ఎన్నో పాటలు పాడిండు. ప్రైవేట్ ఆల్బంలలో 500లకు పైగా పాటలు పాడిండు.
స్పాట్
తెలుగు సినమాల్లో రవివర్మ పాడిన పాటల్లో మాస్ సినిమాలో మమమాస్పాట..ఇడియట్ లో చెలియా చెలియా పాట..భద్ర సినిమాలో ఓ మనసా ఓమనసా అనే పాట చాలా ప్రజాదరణ పొందినయి. జయం సినిమాలో బండి బండి రైలు బండి పాటకూడా చిన్నపిల్లలనుంచి పెద్దవాళ్ల దాకా హమ్మింగ్ చేసేదే..లారెన్స్ యాక్ఠ్ చేసిన స్టైల్ మూవీలో టైటిల్ సాంగ్ ప్రతి డాన్స్ లెర్నకు ఉత్తేజాన్నిచ్చే మంత్రం.
స్పాట్
రవివర్మ గళంలో మాస్ మసాలా పాటలు, మెలోడి మధురిమలు అలవోకగా ఒదిగిపోతయి. ఆ సుస్వరాల సవ్వడిని ఎంత విన్నా తనివి తీరదు. అందుకే ఎందరో సంగీత దర్శకులు ఆయన పాటలకు అభిమానులై పాడించుకున్నరు. తెలంగాణ స్వరమాంత్రికుడు చక్రి, మ్యూజిక్ తో మాజిక్ చేసే కీరవాణి,. సూపర్ మ్యూజిక్ డైరక్టర్ మణిశర్మ., యూత్ఫుల్ మ్యూజిక్నందించే ఆర్పీ పట్నాయక్లు రవివర్మ గమకాలతో గందర్వస్వరాలను మదించిన్రు.
స్పాట్
రవివర్మ స్వరాలకు తగిన గుర్తింపే లభించింది. ఎన్నో అవార్డులు ఆయన సరసన చేరి ఉప్పొంగిపోయినయి.ఆయన పాడిన తొలిపాటకే “అలాపన మ్యూజిక్ అవార్డు” సొంతం చేసుకున్నరు...చిత్రం సినిమాలో పాడిన డిల్లీ నుంచి గల్లీదాక పాటకు బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ విభాగంలో ఈ అవార్డు వచ్చింది. ఆర్య చిత్రంలో ఓ మైబ్రదరు అనే పాటకు 2004లో వంశీ స్పెషల్ జ్యూరీ అవార్డు ను సొంతం చేసుకున్నడు. 2006లో సంగం సుశీల యూత్ అవార్డును సొంతం చేసుకుండు. రవివర్మ కెరీర్లో ఎన్నోమైళ్లు అధిగమించిండు. తన విజయాల వెనక తనకుంటుంబ ప్రోత్సాహం చాలా ఉంటదని గర్వంగా చెప్పుకుంటడు రవివర్మ. రవివర్మ స్వరజల్లుల్లో మనమూ తడిసి తరిద్దాం..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి