29, ఏప్రిల్ 2011, శుక్రవారం

మిట్టపల్లి సురేందర్ ( కవి, గాయకుడు)

మిట్టపల్లి సురేందర్….
అడవి బిడ్డల గుండె గొంతును తన కలంతో పలికించినోడు..(ఆదిలాబాద్ జిల్లరా పాట బ్యాక్ గ్రౌండ్) పల్లెపచ్చదనాన్ని పండువెన్నెల చల్లదనాన్ని తన పాటలల్లో ఒదిగించినోడు..(పండువెన్నల పాట బ్యాక్ గ్రౌండ్) ఉద్యమ పాటలకు ఊపిరి పోసిన పల్లెకవి.. ఎండుటాకుల వెన్నుపూసలు దీసి ఆయుధాలనిచ్చి, అడవి పోరాడమన్నదని విప్పి చెప్పిండు. కన్నబిడ్డలను కోల్పోయిన వీరమాతల గర్భశోకాన్ని తలచి రాతి బొమ్మలల్ల కొలువైన శివుణ్ని ఇదేం రాత అని ప్రశ్నించిండు. తలరాతను మార్చే బతుకుకోసం ఎదిరించి పోరాడమని బోధించినోడు మిట్టపల్లి సురేందర్.
స్పాట్
మధురమైన పాటలు రాసిన మిట్టపల్లి సురేందర్ పుట్టింది వరంగల్ జిల్లా చిట్యాల మండలం..వెల్లంపల్లిగ్రామం. తండ్రి నర్సయ్య, తల్లి మధునమ్మ. తన పాటకు ప్రాణం పల్లె జీవితమే నంటడు..తాను రాసిన గేయాలన్నీ బడుగు జీవుల మనసు గాయాలను మాన్పేవేనని సగర్వంగా చెప్పుకుంటడు. గోరటి వెంకన్న, చంద్రబోస్, అందెశ్రీ, వేటూరి వంటి కవులు రాసిన సాహిత్యం తన పాటలకు స్పూర్తని అంటడు. సురేందర్ గుభాళించిన సాహితీ సౌరభాలు తెలంగాణ పల్లెల్లో ఇంటింటా గుప్పుమంటున్నయి. సురేందర్ సినిమాల్లో కూడా పాటలు రాసిండు. నాన్ స్టాప్, ధైర్యం వంటి చిత్రాల్లో సినీగేయాలు రాసి సినీ ప్రముఖుల చేత శబాష్ అనిపించుకున్నడు. సురేందర్ స్పృషించని సామాజిక అంశం లేదు, తాకని తండ్లాట లేదు. ఇన్ని పల్లె పాటలు రాసిన సురేందర్ మరిన్ని మంచి పాటలు రాయాలని కోరుకుందాం..
వడ్లకొండ అనిల్ కుమార్..
సురేందర్ కలానికి గళమైనిలిచిన వ్యక్తుల్లో అనిల్ ఒకరు. పాటకు కొత్త హొయలు దిద్ది ప్రాణం పొసిన గాయకుడు. పుట్టింది కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం, జమ్మికుంట గ్రామం. తండ్రి మొగిలయ్య, తల్లి సుగుణమ్మ. బార్డర్ లో సైనికుడా పాటతో వడ్లకొండ అనిల్ కుమార్ ప్రపంచానికి పరిచయం అయిండు. యం. కామ్ పూర్తి చేసిన అనిల్ చదువుకునేటప్పటి నుంచే తన గళానికి పదును పెట్టిండు. యన్ యస్సెస్ లో ఢిల్లీ రిపబ్లిక్ డే కు సెలక్టయిండు. ఆ అవకాశంతో ఢిల్లీ వారణాసిలలో పాటలు పాడిండు. తన పాటలు ఖండాతంరాలను వ్యాపింపజేసిండు అనిల్. మలేషియా వంటి దేశాలలో కూడా తన గళమాధుర్యాన్ని వినిపించిండు.
స్పాట్( ఇద్దరివి కలిపి)
తెలంగాణ కళాకారులు మిట్టపల్లి సురేందర్, వడ్లకొండ అనిల్ కుమార్ లు మరిన్ని స్వరశిఖరాలు అధిరోహిచాలని కోరుకుందాం..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి