29, ఏప్రిల్ 2011, శుక్రవారం

నర్సిరెడ్డి, నల్లగొండ సైదులు (ఉద్యమ గళాలు)

Mm pkg 17/04/2011
తెలంగాణ మాగాణం నిండా తడి ఆరని గాయాలే.. ఈ గాయాలను మాన్పే గేయాలు ఎన్నో పుట్టుకొచ్చినయి. ఆ గేయాలు కళాకారుల గళంలో నిప్పు కణికలై చిచ్చర పిడుగులై దోపిడి దారుల గుండెల్లో మంటలు రేపినయి. తెలంగాణ కళామతల్లి బిడ్డలంతా ఒక్కటయిన్రు. పచ్చని పైర్లను కలలు గన్న నా తెలంగాణ పడావెందుకు బడ్డదని గొంతెత్తిన్రు. అలా ఊరూరా వాడ వాడనా కళాకారులు ఉద్యమంలో గళం కలిపిన్రు. అలా వెలిగిన తెలంగాణ కళామతల్లి నుదిటి సింధూరాలే.. సైదులు, నర్సిరెడ్డి.
Intro Anchor
పాటంటే నర్సిరెడ్డికి ప్రాణం.. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఎందరో మేటి కళాకారులకు ఏకలవ్య శిశ్యుడుగా ఎదిగిన నర్సిరెడ్డి, ఉద్యమమే ఉపిరిగా.. ఎన్నో ధూంధాం సభలల్లో గళం వినిపించిన నకిరెకంటి సైదులు మనతో ముచ్చట బెట్టేందుకు టి. న్యూస్ కు వచ్చిన్రు.
Voice over
తెలంగాణను పరాయి పాలననుంచి విముక్తి కలిగించేందుకు ఎందరో కళాకారులు తమ గళాలకు పదును పెట్టిన్రు. తెలంగాణ పది జిల్లాలలో పదం నేర్చిన ప్రతి బిడ్డా, పాట నేర్చిన ప్రతి గాయకుడు ఉద్యమానికి ఊతమయిన్రు. అలా తెలంగాణ ఉద్యమంలో తన వంతుగా పాటలు రాస్తూ పాడుతున్న కళాకారుడు నకిరికంటి సైదులు.
స్పాట్
ఒళ్లంతా ఉద్యమ సారాన్ని నింపుకున్నట్టు గళమెత్తుతున్న ఈ కళాకారుడి పేరు నకిరికంటి సైదులు. సైదులు పుట్టింది నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం కాజీరామారం గ్రామం. తండ్రి పాపయ్య, తల్లి సాలమ్మ. సైదులుకు చిన్నప్పటి నుంచి పాటలు పాడటమంటే చాలా ఇష్టం . ఆ ఇష్టమే అతణ్ని ప్రజానాట్యమండలి వైపు నడిపించింది. విద్యార్ది ఉద్య మాల్లో చురుకైన పాత్రపోషించిన సైదులు తరువాత ఉద్యమం వైపు నడిచిండు. 2007 నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్నడు. తెలంగాణకు జరిగిన ధోకా మీద పాటలు గట్టిండు. ఇప్పటి వరకు దాదాపు 150 ధూంధాంలలో పాల్గొన్నడు. 25 ఏళ్లుగా ఉద్యమగీతాలు ఆలపిస్తున్న సైదులు స్వరాలు ఉద్యమానికి మరింత ఊపునిస్తయని ఆశిద్దాం.
స్పాట్
చాలా మందికి పాట పాడాలని ఉంటది..కానీ పాట పాడగల గళం కొందరికే సొంతం.. ఒకవేళ పాట పాడ గలిగినా.. ఎవరికి వారికి ఓ స్టైల్ అంటూ ఉంటది. కానీ ఇక్కడ మనం చూస్తున్న ఈ కళాకారుడు ఉద్యమ ప్రస్థానంలో దిట్ట అనుకుకున్న మేటి కళాకారుల గొంతులను తన గళంలో ఒంపుకొని వారే ఇతనిలోకి పరకాయ ప్రవేశం చేసిన్రా అన్నట్టుగా పాడగలడు. ఒకే గళంలో వివిధ రకాల వ్యక్తుల గొంతులను పలికించ గల స్వరవిన్యాసం నర్సిరెడ్డికే సొంతం. నర్సిరెడ్డి పుట్టింది నల్లగొండ జిల్లా చండూరు మండలం గుండ్రపల్లి గ్రామం. 12 సంవత్సరాల నుంచి పాట పాడుతున్న నర్సిరెడ్డి ఎన్నో సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నరు.
స్పాట్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి