29, ఏప్రిల్ 2011, శుక్రవారం

గంగా స్వాతి జానపద గాయనిలు

ఎ. జనార్దన్
తెలంగాణ తనువంతా జానపదాల జాతరే..ఈ పాటల పల్లకికి బోయీలుగా మారిన ఎందరో కళాకారులు తెలంగాణ కళామతల్లికి ముద్దుబిడ్డలు. కళల కణాచి తెలంగాణ మట్టిలో పుట్టిన వారసత్వ గేయాలను ఒడిసి పట్టి ముందుతరాలకు మోస్తున్న జానపద కళాకారులలో వర్ధమాన గాయనిలు గంగ, స్వాతి. తమ ఫోక్ వాయిస్ తో ఇటు కళాభిమానుల చేత విమర్శకుల చేత ప్రశంసల జల్లులుఉ కురిపించుకున్న ఈ జోడు గళాలు గొంతెత్తితే పల్లెకోయిలలు సైతం పరవశించి పోతయి.
స్పాట్
గంగ..పుట్టింది నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం ముల్లంగి గ్రామం. తండ్రి అంకుల మల్లయ్య, తల్లి సాయమ్మ. జాబిలమ్మను చూపి తినిపించే గోరుముద్దల తోనే అమ్మ జానపదాలు నేర్పింది. స్కూల్ స్థాయిలో పాటలు పాడి ప్రతి పోటీలో జానపదాలను ఆలపించడంలో తన మార్కు వేసుకుంది. గంగ గళమెత్తితే ఎంత పెద్ద సభకూడా గాలిచప్పుడు వినపడేంత నిశ్శబ్దంగా మారుతదని అభిమానులు చెప్పుకుంటరు. వాగ్దేవి డిగ్రీ కళాశాలలో డిగ్రీ రెండవ సంత్సరం చదువుతోంది.
స్పాట్
గంగ ఎంటర్ టైన్ మెంట్ చానళ్లలో, న్యూస్ చానళ్లలో మ్యూజికల్ ప్రోగ్రాంలలో పాల్గొని తన ప్రతిభను నిరూపించుకొంది. మాటీవి నిర్వహించే రేలారే రేలా , సూపర్ సింగర్స్ కార్యక్రమాలలో ముందంజలో నిలిచింది. గంగ గళ మాధుర్యానికి పరవశించిన అనేక మంది ప్రముఖులు వివిధ జిల్లాలలో ప్రదర్శనలిప్పించిన్రు. తెలంగాణ ధూంధాంలలో ప్రదర్శనలిచ్చి ఉద్యమంలో తన వంతు పాత్రపోషించింది. 2007 నుంచి అనేక ప్రజా చైతన్య కార్యక్రమాలలో పాల్గొంటూ జానపదాలను జనబాహుళ్యంలోకి తీసువెళ్తున్నది గంగ.
స్పాట్
స్వాతి.. ఈ జానపదాల మధురగాయని పుట్టింది నల్లగొండ జిల్లా మోత్కూర్ మండలం అడ్డగూడూరు గ్రామం. తండ్రి పూర్ణయ్య తల్లి పుష్ప. డిగ్రీ వరకు చదువుకుంది. మల్టీ మీడియాలో ప్రవేశించిన స్వాతికి రేలా రె రేలా లో అవకాశం వచ్చింది. మొదటి ఎపిసోడ్తో మొదలైన ప్రస్థానం చివరి ఎపిసోడ్లో విజేతగా నిలిచే వరకు సాగింది. సూపర్ సింగర్స్లో కూడా తన సత్తా చాటింది. స్వాతి స్వరంలో జానపదాలు చేసే లయవిన్యాసం మాధుర్యం ఇంటి ఆడపడుచును గుర్తుకు తెస్తది. బతుక్మ పాటలు, ఉయ్యాల పాటలు ఆమె నోటినుంచి అలవోకగా జాలువారుతుంటయి. పల్లెపాటకు ప్రాణం పోస్తున్నస్వాతి వర్థమాన జానపద కళాకారులకు ఆదర్శంగా నిలుస్తుంది.తన తోటి కళాకారులను ప్రోత్సహిస్తుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి